తెలంగాణ
ఇవాళ తెలంగాణలో మూడు మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక

ఇవాళ తెలంగాణలో మూడు మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి, ఖానాపూర్‌లో ఎన్నిక నిర్వహించనున్నారు. మూడు చోట్ల అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులకు 13 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 2, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు.
19వ వార్డు ఆకుల యాదగిరి కిడ్నాప్ వివాదంతో ఎన్నిక వాయిదా పడింది. క్యాతన్‌పల్లిలో 22 వార్డులకు బీఆర్ఎస్, సీపీఐ కూటమి 14 సీట్లు సాధించింది. చైర్మన్ పీఠం బీఆర్ఎస్కు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక ఖానాపూర్‌లో 12 స్థానాలకు బీఆర్ఎస్, బీజేపీ చెరో నాలుగు చోట్ల గెలుపొందాయి. 3 చోట్ల గెలిచిన కాంగ్రెస్, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ మూడు మున్సిపాలిటీల్లో ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది.



