తెలంగాణ
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారింది. దీంతో ఈరోజు ఉదయం తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయానికి మొత్తం 26 గేట్లు ఉండగా ప్రస్తుతం 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో క్రస్ట్ గేట్ల ద్వారా 78 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది.