తెలంగాణ
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Telangana: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ సీఎం రేవంత్ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సమ్మతి తెలిపారు. గవర్నర్ ఆమోదం లభించినందున న్యాయశాఖ గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆ తర్వాత చట్ట సవరణ చేసే అవకాశం ఉంది.



