సినిమా
Akhanda 2 : హైకోర్టులో అఖండ 2 సినిమాకు షాక్

Akhanda 2: అఖండ 2 నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ సినిమా ప్రియయర్ షో టికెట్ ధరల పెంపు జీవోను తెలంగాణహైకోర్టు సస్పెండ్ చేసింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు, సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఈ నెల 12న విడుదలకు సిద్ధమైన అఖండ 2 చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను భారీగా పెంచేందుకు అనుమతి ఇచ్చింది.
జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్లలో టికెట్‌కు అదనంగా రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈ నెల 11న రాత్రి 8 గంటలకు ప్రదర్శించనున్న ప్రత్యేక షోకు టికెట్ రేటును రూ.600గా నిర్ణయించేందుకు కూడా ప్రభుత్వం జీవోలో అనుమతి ఇచ్చింది. అయితే తాజా పరిణామంగా, ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపును తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది.



