తెలంగాణ
సింగపూర్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం

Revaanth Reddy: సింగపూర్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్‌కు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ముందుకొచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును పరిశీలించింది.