తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వ డేటా హ్యాక్ !

తెలంగాణ ప్రభుత్వ డేటా హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో డేటా చోరీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ డేటాను డార్క్ వెబ్‌సైట్‌లలో సైబర్ నేరగాల్లు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఆరోగ్య శ్రీ, ధరణి, మీ సేవ, జీహెచ్‌ఎంసీకి చెందిన డేటా హ్యాక్ అయినట్లు సమాచారం.
22 విభాగాలకు చెందిన డేటా డార్క్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం అయ్యింది. డేటా హ్యాక్ విషయాన్ని ప్రభుత్వ విభాగాలు గుర్తించలేదు. సెక్యూరిటీ లోపాలు ఉన్న విభాగాలను టార్గెట్ చేసి డేటా చోరీ చేస్తున్నారు కేటుగాళ్లు. అయితే డేటా చోరీపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలంగాణ పోలీసులు తెలిపారు.



