సినిమా

‘మన శంకరవరప్రసాద్‌ గారు’ టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ గ్రీన్‌ సిగ్నల్‌

Mana Shankara Varaprasad Garu: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్ తో పాటు, టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

జనవరి 11న జరిగే ప్రీమియర్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించగా, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు షో నిర్వహించాల్సి ఉంటుంది. జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా వసూలు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ ధరలు పెంపుకు అనుమతి ఇచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button