తెలంగాణ
KTR: అన్ని రంగాల్లో తెలంగాణ బిడ్డలు రాణిస్తున్నారు

KTR: అమెరికాలోని డల్లాస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఖండాలు దాటి వచ్చి తెలంగాణ జెండాను రెపరెపలాడిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ బిడ్డలు రాణిస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. ఉద్యమ కాలంలో తెలంగాణ ఎన్ఆర్ఐలువేల మైళ్ల దూరంలో ఉన్నా తెలంగాణ సంస్కృతి మరిచిపోలేదన్నారు. అమెరికాలో ఉన్న ఎన్నారైలను చూసి తెలంగాణ సమాజం గర్వపడుతోందని కేటీఆర్ అన్నారు.