తెలంగాణ
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు

కేబినెట్ బెర్త్ కోసం తెలంగాణ మాదిగ ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లారు. హస్తినలో AICC చీఫ్ ఖర్గే, పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను ఇవాళ కలిసే అవకాశం ఉంది. తమ సామాజిక వర్గానికి కేబినెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్నారు. హైకమాండ్ పెద్దలందర్నీ కలుస్తామంటోన్నారు ఎమ్మెల్యేలు.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సమస్యల్ని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. అయితే వీటన్నింటిపై హైకమాండ్‌తో మాట్లాడతానని మీనాక్షి నటరాజన్, మాదిగ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.