తెలంగాణ
Revanth Reddy: కర్నూల్ ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆరా

Revanth Reddy: కర్నూల్ ప్రమాదం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్వాల్ కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ఏపీ సీఎస్, డీజీపీతో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడాడరు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రమాదంపై తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.



