తెలంగాణ
Telangana: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ

Telangana: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఉదయం 11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్‌తో రేవంత్ భేటీ కానున్నారు. పదకొండున్నరకు పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక ఫోరంలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్‌బర్గ్, గోద్రెజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చించనున్నారు. మధ్యహ్నం పన్నెండున్నరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో భేటీ కానున్నారు.



