తెలంగాణ
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లపై ..కీలక చర్చ

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ఇక 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.



