తెలంగాణ
TBJP: విజయోత్సావంలో తెలంగాణ బీజేపీ

TBJP: విజయోత్సావంలో తెలంగాణ బీజేపీ మునిగితేలుతోంది. రెండు ఎమ్మెల్సీలను గెలుచుకుని తమ సత్తా చాటుకుంది. MLC ఎన్నికల్లో మల్క కొమురయ్య, అంజిరెడ్డి విజయం సాధించ డంతో.. 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ ప్రభావం చూపనుంది.
మొత్తానికి ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో 13 జిల్లాలు, 217 మండలాల్లో బీజేపీ తమ హవా ఏంటో చూపించింది. ఇక రెండు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడంతో, ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు జరుపుకోనున్నారు.