తెలంగాణ
తెలంగాణలో బీసీ సంఘాల బంద్

తెలంగాణలో బీసీ సంఘాల బంద్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బంద్‌కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
బస్సు డిపోల దగ్గర నేతలు ఆందోళనలకు దిగారు. డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డగించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నినాదాలు చేశారు. బంద్ పిలుపుతో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. బంద్‌లో విద్యాసంస్థలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి.



