తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…ప్రత్యక్ష ప్రసారం

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. గత నెల 29న శాసనసభ, శాసనమండలిలో నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉభయ సభల్లో ఉంచనున్నారు. మూడు రోజుల విరామం అనంతరం సమావేశాలు పునఃప్రారంభం కావడంతో కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వ బిల్లులు, విధాన నిర్ణయాలతో పాటు ప్రతిపక్షాల ప్రశ్నలు, సూచనలతో సభా కార్యకలాపాలు ఉత్కంఠగా సాగే అవకాశముంది.



