తెలంగాణ
Telangana Assembly Session : డిసెంబర్ 28 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ?

Telangana Assembly Session: అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ, జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ, హిల్ట్ పాలసీ, ఫార్ములా ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ విచారణతో పాటు సాగునీటి ప్రాజెక్టుల విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై చర్చించే చాన్స్ ఉంది.



