తెలంగాణ
Road Accident: లారీ-కారు ఢీకొని ఫిల్మ్‌నగర్ ఎస్ఐ మృతి

Siddipet: సిద్ధిపేట జిల్లా చేర్యాల గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొని హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ ఎస్ఐ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఎస్ఐ రాజేశ్వర్‌గా గుర్తించారు. హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు ముగించుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఎస్ఐ రాజేశ్వర్ స్వస్థలం సంగారెడ్డిలోని చాణక్య పురి కాలనీ అని పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితమే ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించారు. 1990లో పోలీస్ శాఖ ఉద్యోగంలో చేరినట్లు చెప్పారు.