జాతియం
మహాఘఠ్‌బంధన్ సీఎం అభ్యర్ధిగా తేజస్వీ యాదవ్

బిహార్ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ పేరును కాంగ్రెస్ నేత అశోక్‌గెహ్లాట్ అధికారికంగా ప్రకటించారు. తేజస్వీ యాదవ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాఘటబంధన్ కూటమి నేతలు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం అభ్యర్ధిగా ముఖేశ్ సహానీని ప్రకటించారు.



