తెలంగాణ
సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పందించిన తీన్మార్ మల్లన్న

సుప్రీం కోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న స్పందించారు. సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎలాంటి మెరిట్స్ లోపలికి వెళ్లలేదని అన్నారు. హైకోర్టులో కేసు ఉన్నందున హైకోర్టుకు వెళ్లమని సుప్రీంకోర్టు సూచించిందని. ఇది గవర్నమెంట్ విజయం కాదని స్పష్టం చేశారు. 42శాతం రిజర్వేషన్లు రాకపోతే.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీ జనాభాన్ని ఊహల పల్లకిలో ఉంచుతున్నారని విమర్శించారు.



