తెలంగాణ
Teenmar Mallanna: బీఆర్ఎస్ పాలనలో వేల ఫోన్లు ట్యాప్.. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

Teenmar Mallanna: బీఆర్ఎస్ పాలనలో వేల ఫోన్లు ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. మావోయిస్టు సానుభూతిపరులనే ఆరోపణలతో తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో తన రెండు ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని తెలిపారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా, ప్రజల అభిష్టానికి మద్దతుగా పోరాడుతున్నాననే తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు.
తనతో పాటు తన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తమ కదలికలు తెలుసుకోవడానికి ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం అప్పటి ప్రభుత్వానికి ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరమని ట్యాపింగ్‌కి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.