క్రీడలు
టెక్నో పెయింట్స్ ప్రచారకర్తగా సచిన్ నియామకం

హైదరాబాద్‌లో టెక్నో పెయింట్స్ ప్రచారకర్తగా సచిన్ నియమితులయ్యరు. మూడేళ్లు ఆయన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగనున్నారు. దేశీయ పెయింట్స్ రంగంలో టెక్నో పెయింట్స్ 25 ఏళ్లుగా సుస్థిర స్థానం సంపాదించి, ఏడు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతుందని కంపెనీ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది మరో అయిదు రాష్ట్రాలకు విస్తరణ సెప్టెంబర్ నాటికి ఐపీఓ పూర్తి చేస్తామన్నారు.
ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సమీకరిస్తామని కంపెనీ ఆకూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సంస్థలో సచిన్ చేరికతో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామన్నారు. 2024-25లో 210 కోట్ల ఆదాయం ఆర్జించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 450 కోట్లు ఆశిస్తోందని కంపెనీ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.



