ఆంధ్ర ప్రదేశ్
Kurnool: విద్యార్ధినులపై టీచర్ లైంగిక వేధింపులు
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్ధినులపై లైంగిక టీచర్ లక్ష్మన్న వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఉపాధ్యాయున్ని పాఠశాల గదిలో బంధించారు. సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
ఉపాధ్యాయునిపై బాలిక తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. టీచర్ లక్ష్మన్న విద్యార్థినిలపై లైంగిక వేధింపులు చేస్తున్నాడని.. సెల్ ఫోన్‌లో న్యూడ్ వీడియోలు చూపిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు.