Tamil Nadu: దారుణం.. ప్రేయసిని నరికి చంపిన యువకుడు

Tamil Nadu: తమిళనాడులోని తంజావూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అజిత్‌కుమార్ అనే యువకుడు ప్రియురాలిని నరికి చంపాడు. తనను ప్రేమించి మరొకరిని పెళ్లిచేసుకుంటుందని ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరికీ 15 ఏళ్ల వయసు నుంచే స్నేహం ఉంది. 13 సంవత్సరాలుగా ఇద్దరూ ప్రేమలోనే ఉన్నారు. అయితే.. ఈ ఇద్దరి పెళ్లికి కావ్య కుటుంబం ఒప్పుకోలేదు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది.
తన నిశ్చయతాంబూలం జరిగిన విషయం, ఫోటోలు కూడా కావ్య అజిత్ కుమార్ కు పంపించింది. దీంతో అజిత్ కుమార్ తీవ్ర కోపంలో పడ్డాడు. ఆవేశంతో ఊగిపోతూ వెంట తెచ్చుకున్న కత్తితో కావ్యను పదే పదే పొడిచాడు. కర్కశంగా కత్తితో దాడి చేయడంతో కావ్య తీవ్ర గాయాల పాలైంది. కొంతసేపటికే స్పాట్లోనే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.



