ఆంధ్ర ప్రదేశ్

Srikakulam: విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్

Srikakulam: తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ విద్యార్థినులతో సేవలు చేయించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలోని తరగతి గదిలో తీరిగ్గా కూర్చని ఫోన్ మాట్లాడుతూ పిల్లలతో కాళ్లు నొక్కించుకుంది టీచర్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీచర్ నిర్వాకంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ స్పందిస్తూ సదురు టీచర్‌కు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button