ఆంధ్ర ప్రదేశ్
Anakapalli: స్కూల్ భవనం పెచ్చులు ఊడిపడి టీచర్ మృతి

Anakapalli: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో విషాదం నెలకొంది. రాజానగరం జెడ్పీ హైస్కూల్ భవనం పెచ్చులు ఊడిపడి టీచర్ మృతి చెందింది. స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా జ్యోత్స్నా భాయ్ పనిచేస్తోంది.
స్కూల్ భవనం నిర్మాణంలో ఉండగా ఒక్కసారిగా భవనం పెచ్చులు ఊడిపడి టీచర్‌పై పడ్డాయి. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా జ్యోత్స్నా భాయ్ మరణించింది. జ్యోత్స్నా భాయ్ స్వస్థలం కాకినాడ జిల్లా తుని.



