ఆంధ్ర ప్రదేశ్
పులివెందులలో టీడీపీ ఘన విజయం

పులివెందుల జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థిపై 6వేల 733 ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందింది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 682 ఓట్లు మాత్రమే వచ్చాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.



