ప్రభాస్ తో మరోసారి మిల్కీ బ్యూటీ రొమాన్స్?

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం హారర్ కామెడీ జోనర్‌లో అద్భుత అంచనాలు సృష్టిస్తోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. హారర్, కామెడీ, రొమాన్స్‌ల మిళితంగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని రెట్టింపు చేసింది. తాజాగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల సమాచారం.
బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌తో సంచలనం సృష్టించిన తమన్నా, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించనుంది. గతంలో ‘రెబల్’, ‘బాహుబలి’ చిత్రాల్లో ప్రభాస్‌తో కలిసి నటించిన తమన్నా, ఈ సాంగ్‌తో సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొస్తుందని అంచనా. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.