Tamannaah: బ్రేకప్ తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతున్న తమన్నా

Tamannaah: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి బాలీవుడ్‌లో స్టామినా చూపిస్తుంది తమన్నా. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంది. విజయ్ వర్మతో ఈ ఏడాది ఏడడుగులు వేయాలనుకుంది. కానీ పెళ్లి, కెరీర్ విషయంలో బేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. అయితే బ్రేకప్ తరువాత తమన్నా మరింత స్ట్రాంగ్ అయ్యింది.
ప్రస్తుతం తమన్నా సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఓదెల 2 చేస్తోంది. ఇందులో లేడీ అఘోరీగా కనిపించబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అలాగే డార్లింగ్ పేరెంట్స్ అనే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అజయ్ దేవగన్, సంజయ్ దత్ నటిస్తోన్న రేంజర్ మూవీలో తమన్నా భాటియా ఫిక్సైనట్లు సమాచారం.
హిమ్మత్ వాలా తర్వాత అజయ్ దేవగన్ తో కలిసి నటిస్తోంది మిల్కీ బ్యూటీ. జగన్ శక్తి దర్శకత్వంలో లవ్ ఫిల్మ్స్ తెరకెక్కితోంది. జంగిల్ అడ్వెంచర్ ఎక్స్ పీరియన్స్ మూవీగా రాబోతుంది. దీన్ని నెక్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారని బాలీవుడ్ మీడియా చెబుతుంది. ఇందులో తమన్నా ఫుల్ లెంత్ రోల్‌లో కనిపించనుందట. మళ్లీ కెరీర్ పై కాన్సట్రేషన్ చేస్తున్న తమన్నా బీటౌన్ తో పాటు టాలీవుడ్ లోను బిజీ అవుతుందేమో చూడాలి.