తెలంగాణ
Talasani: పరిశ్రమల భూములపై భారీ స్కాం ..రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోంది

Talasani Srinivas Yadav: పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌లతో కలిసి తలసాని పర్యటించారు. 5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి రేవంత్ సర్కార్ తెరతీసిందన్నారు. నగరంలోని 21 ప్రాంతాల్లో 9వేల 292 ఎకరాల భూములను తక్కువ ధరకు బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందన్నారు.



