తెలంగాణ
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్‌ఐ

ఖమ్మం జిల్లా తల్లాడలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. .10 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దార్, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీకి చిక్కారుఓ రైతు నుంచి తహసీల్దార్ 12 వేలు లంచం డిమాండ్ చేయగా.. చివరకు రూ.10 వేలకు అంగీకారం కుదిరింది.
తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వంకాయలపాటి సురేశ్, ఆర్‌ఐ మాలోతు భాస్కర్‌నాయక్, కంప్యూటర్ ఆపరేటర్ బానోతు శివాజీ రైతు నుంచి 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు.



