Vishal: సినిమా రివ్యూలపై విశాల్ సంచలన వ్యాఖ్యలు!

Vishal: నటుడు విశాల్ సినిమా రివ్యూలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ ముందు తొలి మూడు రోజులు పబ్లిక్ రివ్యూలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తమిళ నటుడు విశాల్ సినిమా రివ్యూలపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ‘రెడ్ ఫ్లవర్’ ఈవెంట్‌లో మాట్లాడుతూ, సినిమా విడుదలైన తొలి మూడు రోజులు థియేటర్ల వద్ద పబ్లిక్ రియాక్షన్‌లు తీసుకోవడం మానుకోవాలని కోరారు.
యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు సినిమా విడుదలైన వెంటనే రివ్యూలు ఇవ్వడం వల్ల చిత్రానికి నష్టం జరుగుతోందని, ప్రేక్షకులు సినిమాను చూసే ముందే నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం 12 షోలు పూర్తయ్యే వరకు రివ్యూలను నిలిపివేయాలని, సినిమాను బతికించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మద్రాస్ హైకోర్టు ఇటీవల ఆన్‌లైన్ రివ్యూలపై నిషేధం కోరిన పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ, విశాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై సినీ పరిశ్రమ నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి.