తెలంగాణ
Khammam: కోతికి ఘనంగా అంత్యక్రియలు

ఖమ్మం జిల్లా కూసుమంచి జీళ్ళచెరువు గ్రామంలో శ్రావణ శుక్రవారం విద్యుత్ షాక్ తో కోతి మృతి చెందింది. గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ పై తిరుగుతుండగా విద్యుత్ షాక్‌కి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామస్థుల ఆధ్వర్యంలో కోతికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో ఊరేగింపుగా ప్రజలంతా పాల్గొని కోతికి అంత్యక్రియలు నిర్వహించారు.