తెలంగాణ
Hyderabad: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ రాయదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని ల్యాంకో హిల్స్‌లో ఫ్లాట్‌కు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వాలివేటి హితేష్ ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమ విఫలమై మానసిక ఒత్తిడి తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని హితేష్ తమ్ముడు వెల్లడించారు.
అయితే హితేష్‌కు తమ్ముడు ప్రమోద్ కాల్ చేయగా ఎంతకూ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటికి వచ్చి చూడగా అప్పటికే మృతిచెందినట్లు ప్రమోద్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.