తెలంగాణ
మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటీ

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై కొండా దంపతులు మీనాక్షి నటరాజన్‌కు వివరణ ఇస్తున్నట్లు తెలుస్తుంది.
కాగా ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కొండాకు వ్యతిరేకంగా వరంగల్ పార్టీ నేతలు ఏకమయ్యారు. అంతేకాదు కొండా మురళిపై ఆయన వ్యతిరేక వర్గం చర్యలకు పట్టుబడుతోంది.