సినిమా
Singer Kalpana: నిలకడగా గాయని కల్పన ఆరోగ్యం

Singer Kalpana: ప్రముఖ గాయని కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు కల్పన ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ఆమె భర్త ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అటు కల్పనను చూసేందుకు హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు తోటి గాయకులు.
హైదరాబాద్ నిజాంపేటలోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగింది కల్పన. సమాచారం మేరకు స్పందించిన పోలీసులు హుటాహుటిన ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ సింగర్‌లో కల్పన ఒకరు.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో అనేక పాటలు పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయ రాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవీ మహాదేవన్‌తో కలిసి ఆమె ఎన్నో మధురమైన పాటలు పాడారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.