తెలంగాణ
Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నాలుగు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. విజయబాడ నుండి హైదరాబాద్ వస్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుకున్న కారును కంటైనర్ బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు పూర్తిగా బస్సు కిందకు వెళ్ళిపోయింది.
ఆ వెనుక వస్తున్న మరో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.