తెలంగాణ
కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో నిందితుడు నిఖిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. రాంచీలో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రేణు అగర్వాల్ హత్యకు ముందు హర్ష గ్యాంగ్ తూప్రాన్‌లో మందు పార్టీ చేసుకున్నారు. పార్టీలో మొత్తం 9 మందిని పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.



