తెలంగాణ
Ponguleti: విద్య, వైద్యానికి కాంగ్రెస్ పెద్ద పీఠ వేస్తోంది

Ponguleti: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 లోని రెనోవా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థోపెటిక్ ,రోబెటిక్ సర్జరీ యంత్రాన్ని ఆస్పత్రి ఎండి శ్రీధర్ పెద్దిరెడ్డి, ఆర్థోపెటిక్ నిపుణులు సుహాస్ మాసులోమనితో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ గా రూపుదిద్దుకుందని మంత్రి తెలిపారు.
ఇతర దేశాల రోగులు సైతం ఆధునిక వైద్య చికిత్స నిమిత్తం నగరానికి వస్తున్నారంటే ఇక్కడ సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వ్యాపార దృక్పథంతోనే కాక సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచించారు.