తెలంగాణ
Mulugu: అక్రమంగా పశువుల తరలింపు.. సీజ్ చేసిన పోలీసులు

Mulugu: ములుగు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గోవులు తరలిస్తున్న రెండు కంటైనర్లను పోలీసులు పట్టుకున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జాతీయ రహదారి 163 పై ఈరోజు తెల్లవారు జామున వాహన తనిఖీలు చేపట్టారు . పోలీసుల తనిఖీల్లో రెండు కంటైనర్లను పట్టుకున్నారు. కంటైనర్లలో 65 పశువులు ఉండగా వాటిని స్వాదీనం చేసుకుని భూపాలపల్లి గోశాలకు తరలించారు.
హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పశువులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కబేళాలకు తరలిస్తుండగా పట్టుకుని రెండు కంటైనర్లను సీజ్ చేశామన్నారు. కాగా ఆరుగురి పై కేసు నమోదు చేసినట్లుగా ఏటూరునాగారం ఎస్సై తాజుద్దిన్ తెలిపారు.