ఆంధ్ర ప్రదేశ్
నేటి నుంచి పోలీస్ కస్టడీకి మాజీమంత్రి కాకాణి

Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను మూడ్రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు అట్రాసిటీ కోర్టు అనుమతించింది. అయితే కాకాణిని లాయర్ల సమక్షంలో విచారించాలని ఆదేశించింది. మళ్లీ ఆదివారం సాయంత్రం కాకాణిని తమ ఎదుట హాజరుపర్చాలని కోర్టు సూచించింది. ఇక కాకాణి మంత్రిగా పని చేసిన సమయంలో నెల్లూరు జిల్లాలో క్వార్జ్ అక్రమ మైనింగ్ జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
నేటి నుంచి మాజీమంత్రి కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఉదయం 10గంటల 30నిమిషాలకు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. మరోవైపు తనపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు కాకాణి. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ నెల 9కు కేసును వాయిదా వేసింది.