YS Jagan: మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు వైఎస్ జగన్ నివాళి

YS Jagan: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. ఎ. హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ళ అప్పిరెడ్డి, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు అబుల్ కలామ్ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు జగన్. స్వాతంత్య్ర సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని రాసుకొచ్చారు.



