తెలంగాణ
Harish Rao: రేవంత్‌కు పాలన చేతకాకపోతే దిగిపోవాలి

Harish Rao: సిద్దిపేటలోని ఐకేపీ సెంటర్‌ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. హైదరాబాద్‌లో కూర్చొని రోజు అందాల పోటీలపై రేవంత్‌రెడ్డి రివ్యూలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతుల ఆవేదన చెందుతున్నారన అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఫెయిల్ అయ్యాడని హరీష్‌రావు మండిపడ్డారు. రేవంత్‌కు పాలన చేతకాకపోతే దిగిపోవాలన్నారు. పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.