తెలంగాణ
KTR: 400 ఎకరాలే కాదు.. వేల ఎకరాల స్కాం ఉంది

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే HCU స్కాం బయటపెడతానన్నారు కేటీఆర్. 400 ఎకరాలే కాదు.. వేల ఎకరాల స్కాం ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆయన. ఈ స్కాంలో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారంటూ కేటీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు కాంగ్రెస్, బీజేపీ కలిసే HCU భూములు అమ్మేందుకు సిద్ధమయ్యాయి అంటూ పొలిటికల్ బాండ్ పేల్చారు కేటీఆర్. వాస్తవాలను త్వరలోనే బయటపెడతానంటున్నారు కేటీఆర్.
ఇక జాతీయ పార్టీల బతుకు ఢిల్లీ చేతుల్లో ఉందంటూ చెబుతున్న కేటీఆర్ ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రజతోత్సవ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టు కెళ్తాం అంటున్నారు కేటీఆర్. వాస్తవానికి వరంగల్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య లేదన్నారు కేటీఆర్.