ఆంధ్ర ప్రదేశ్
విశాఖ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం

విశాఖలోని కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణావ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వీఎంఆర్డీఏ ద్వారా పర్యాటకానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు ప్రణవ్ గోపాల్. విశాఖ పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనునున్నట్లు తెలిపారు.
త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. దాదాపు 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జి ఒకేసారి 500 టన్నుల బరువు మోయగలదు. గంటకు 250కి.మీ వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు.



