తెలంగాణ
కుక్క దాడిలో బాలుడికి గాయాలు

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని హజ్గుల్ గ్రామంలో ఓ కుక్కలా దాడిలో రుద్రాన్స్ అనే బాలుడు గాయపడ్డాడు. మంగళవారం సాయంత్రము పాఠశాలలకు నుండి ఇంటికి వచ్చి బాలుడు తమ ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ కుక్క ఒక్క సారిగా రుద్రాన్స్పై దాడి చేయగా అరుపులు వేశాడు.
ఇది గమనించిన స్థానికులు కుక్కను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.బాలుడిని కుటుంబీకులు భైంసా ఏరియా హాస్పిటల్ కు తీసుకవచ్చి చికిత్సలు చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కుక్కల భారి నుండి మాకు కాపాడాలని అధికారులకు కోరుతున్నారు.



