Genelia: జెనీలియాకి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్

Genelia: ప్రముఖ నటి జెనీలియా దేశ్‌ముఖ్ కారు ప్రమాదం నుంచి అద్భుతంగా తప్పించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఇద్దరు కొడుకులతో కలిసి బయటకు వెళ్లిన జెనీలియా కారు ఎక్కుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియోలో ఏం జరిగిందంటే?
టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై, కేమియో పాత్రలతో పరిమితమైన ఆమె, 2020లో ‘ఇట్స్ మై లైఫ్’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2022లో రితేష్ దర్శకత్వంలో ‘వేద్’ సినిమాలో నటించారు. నటనతో పాటు ప్రొడక్షన్ పనులు చూస్తూ, ఇద్దరు కొడుకులతో కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.
తాజాగా, జెనీలియా తన కొడుకులతో బయట తిరిగి, కారు ఎక్కుతుండగా ఊహించని సంఘటన జరిగింది. ఆమె పూర్తిగా కూర్చోకముందే డ్రైవర్ కారును ముందుకు నడిపాడు. కారు వేగంగా వెళ్లి ఉంటే, జెనీలియా కిందపడి పెను ప్రమాదం జరిగేది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ‘జాగ్రత్తగా ఉండండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.