తెలంగాణ
Kamareddy: కామారెడ్డిలో కల్తీ కల్లు కలకలం.. 47 మందికి తీవ్ర అస్వస్థత

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు కలకలం రేగింది. కల్తీకల్లు తాగిన 47మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బీర్కూర్, అంకోల్, దామరాంచ గ్రామాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు కల్లు డిపోను సీజ్ చేశారు. అలాగే శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపారు ఆఫీసర్స్. ఘటనపై పలువురిపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీకల్లు బాధితులు కోలుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల చెప్పినట్లు సమాచారం.