తెలంగాణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు ఊరట

SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభాకర్‌రావుకు పాస్‌పోర్టు ఇవ్వాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే పాస్‌పోర్టు ఇచ్చిన మూడ్రోజుల్లో ప్రభాకర్‌రావు ఇండియాకు రావాలంది అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.
తదుపరి విచారణ వరకు ప్రభాకర్‌రావును అరెస్ట్ చేయొద్దని పేర్కొంది. ప్రభాకర్‌రావుపై కఠిన చర్యలు తీసుకోవద్దన్న సుప్రీం తదుపరి విచారణ ఆగస్టు 5కు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుయే ప్రభాకర్‌రావు.