తెలంగాణ
రాహుల్ గాంధీ, ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
అదేవిధంగా రెండు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సభలకు హాజరుకావాలని ఖర్గే అండ్ రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కోరారు.