ఆంధ్ర ప్రదేశ్
Road Accident: అదుపుతప్పి బోల్తా కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Road Accident: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం భూదగవి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుమల నుండి మహారాష్ట్ర వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు తుషార్, శ్రీకర్, కార్తిక్‌లుగా గుర్తించిన పోలీసులు వీరంతా మహారాష్ట్రకు చెందిన వారని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.